సాప్ట్ వేర్ ఇంజినీర్.. మేకులేరుతున్నాడు! | Good samaritan - This techie has picked 37 kg of nails from roads | Sakshi
Sakshi News home page

సాప్ట్ వేర్ ఇంజినీర్.. మేకులేరుతున్నాడు!

Published Mon, Jun 6 2016 1:34 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

సాప్ట్ వేర్ ఇంజినీర్.. మేకులేరుతున్నాడు! - Sakshi

సాప్ట్ వేర్ ఇంజినీర్.. మేకులేరుతున్నాడు!

బెంగళూరు: ఒక సాప్ట్ వేర్ ఇంజినీర్ నాలుగేళ్లుగా రోడ్డుపై ఉన్న ఇనుప మేకులను ఏరడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా ఆయన ఇప్నటి వరకు ఏకంగా నాలుగేళ్లలో 37 కేజీల మేకులను ఏరాడు. ఇలా అతను ఏరడానికి కారణం ఉంది. 2012 లో బెనడిక్ట్ జేబకుమార్ ఔటర్ రింగ్ రోడ్దు లోని తన ఇంటి నుంచి  బెల్లందూరులో  ఉన్న ఆఫీసుకు వెళ్లే మార్గంలో బైక్ పంచర్ అవడం  గమనించాడు. తొలుత టైర్ల కంపెనీని నిందించి సరిపెట్టుకున్నాడు. కానీ పంచర్ షాపు దగ్గరే తరుచుగా బైక్ పంచర్ అవడం గమనించాడు. ఇక లాభం లేదని తన చేతితోనే వాటిని ఏరివేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులు ఒట్టి చేతులతో, తర్వాత అయస్కాంతం సాయంతో మేకులను ఏరడం ప్రారంభించాడు.

అక్కడితో ఆగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. ఫేస్ బుక్ లో 'మై రోడ్ మై రెస్పాన్సిబిలిటీ'  పేజీని ప్రారంభించి ప్రచారం చేస్తున్నాడు. ఇలా రోడ్డుపై మేకులు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపాడు. ఇందుకోసం సీసీటీవీ రికార్డులను పరిశీలించగా రోడ్డుపై మేకులను వేస్తున్న దృష్యాలను పరిశీలించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వదిలేశారని జేబకుమార్ తెలిపారు. బేజకుమార్ కృషిని బెంగళూరు ఆగ్నేయ డీసీపీ బోరలింగయ్య కొనియాడారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement