అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు. ఎవరైనా ఫోన్ చేసి బంపర్ లాటరీ తగిలిందనో.. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండనో అడిగితే అడిగిన వాళ్ల తాట తీసేంత టెక్నాలజీ తెలిసిన వాళ్లు. కానీ సైబర్ నేరాలకు బాధితులుగా మారారు. తమ ప్రమేయం లేకుండా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.. అసలు వాళ్లు ఎలా మోసపోతున్నారు. సిటీల్లో మొదలైన ఈ కొత్తతరహా మోసాన్ని హాస్టళ్ల జీవితాలు గడిపే వాళ్లంతా కచ్చితంగా చూసి తీరాలి.