సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసు మిస్టరీని ఆర్‌సీ పురం పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇరువురి పెళ్లి విషయమై లావణ్య.. సునీల్‌పై ఒత్తిడి తెస్తుండటంతో అడ్డుతొలగించుకోవటానికే ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలింది.