సాధారణంగా లక్షల జీతం తీసుకునే చాలామంది రైలు ప్రయాణం కంటే.. విమాన ప్రయాణాన్నే ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎంత సంపాధించినా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటారు. దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు.
చిరాగ్ దేశ్‌ముఖ్.. ట్రైన్ జర్నీలో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న & ఏడాదికి రూ. 30 లక్షల జీతం తీసుకునే వ్యక్తిని కలిశారు. సంవత్సరానికి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎందుకు ట్రైన్ జర్నీ చేస్తున్నావు అనే ప్రశ్న వేశారు. దీనికి ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సమాధానమిస్తూ.. తన చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఒక రైలు ప్రయాణంలో, ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఆ వ్యక్తి అన్నయ్య కారణంగా నాకు జాబ్ వచ్చింది అని చెప్పారు. ఆ సమయంలో ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయాలని నిర్ణయించుకున్నా అని వివరించారు.
ఈ విషయాన్నే చిరాగ్ దేశ్‌ముఖ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో కొందరు ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుందని అన్నారు. తెలియని వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది. విమాన ప్రయాణంలో ఈ అవకాశం ఉండదు. విమానంలో అందరూ బిజీగా ఉంటారని కొందరు అన్నారు.
Funny story !!!!
Today, I was traveling by train and met a guy who works as a software developer at a big company, earning over 30 lakhs a year. I asked him, "With that kind of money, why aren't you flying instead of taking the train?
Thread... pic.twitter.com/GH5yssTtLT— Chirag Deshmukh (@Geekychiraag) August 20, 2024
Comments
Please login to add a commentAdd a comment