బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్‌ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్‌కు ఫోన్ చేసాడు.
ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు.
ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ
డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్‌ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్‌లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు.
రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్‌లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment