రూ.1.5 కోట్లు.. నాలోని ఇంజినీర్ అర్థం చేసుకోలేడు | Bengaluru Techie Shares Pic Of Water Leaking Rs Crore Apartment | Sakshi
Sakshi News home page

రూ.1.5 కోట్లు.. నాలోని ఇంజినీర్ అర్థం చేసుకోలేడు

Published Tue, Aug 6 2024 8:16 PM | Last Updated on Tue, Aug 6 2024 8:23 PM

Bengaluru Techie Shares Pic Of Water Leaking Rs Crore Apartment

రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజురోజుకి పుంజుకుంటోంది. ఎక్కువ మంది భూములు, అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది నాసిరకం భవనాలను నిర్మించి, ఎక్కువ ధరలకు విక్రయించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటీవల ఓ టెకీ రూ. 1.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌లో నీరు లీక్ అయిన దృశ్యాలను షేర్ చేశారు.

బెంగళూరుకు చెందిన రిపుదామన్ అనే ఇంజినీర్ కొనుగోలు చేసిన తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నీరు లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ నగరంలో రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఈ విధంగా ఉందని వెల్లడించారు.

ఫోటోలను షేర్ చేస్తూ.. రూ. 1.5 కోట్లు ఖర్చు చేసి కొన్న అపార్ట్‌మెంట్‌లోని 5వ/16వ అంతస్తులోని నా గదిలో నీరు కారుతోంది. ఖరీదైన భవనాలు ఎంత మోసం బ్రో! నాలో ఉన్న సివిల్ ఇంజనీర్ దీన్ని అర్థం చేసుకోలేడు అంటూ ట్వీట్ చేశారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement