టెక్కీ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ఆటో డ్రైవర్‌ మృతి | Techie Rash Driving in Hyderabad, Auto Driver Died | Sakshi
Sakshi News home page

టెక్కీ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ఆటో డ్రైవర్‌ మృతి..

Published Fri, Mar 2 2018 7:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కొనసాగుతున్న తాగుబోతు డ్రైవర్ల ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్కీ నవీన్‌ మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. టెక్కీ ర్యాష్‌ డ్రైవింగ్‌తో ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారు ఆటోను కొంతదూరం అలానే ముందుకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్‌ రఫిక్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో టెక్కీ ప్రాణాలతో బయటపడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బేగంపేట పోలీసులు టెక్కీ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement