
జీడిమెట్ల : అర్ధరాత్రి ఆపదలో ఉన్న ఓ యువతికి సహాయం చేసినట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన యువతి(20) అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మందులు తీసుకెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున స్థానిక జగన్ స్టూడియో వద్ద నిలుచుని ఉంది. అదే సమయంలో అటువైపు వెళుతున్న భౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎస్.పరశురామ్ ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు.
మెడికల్ షాపునకు తీసుకు వెళ్లాలని కోరడంతో ఆమెను ఆటోలో ఎక్కించుకున్న పరశురామ్ సదరు మహిళను నైన్ స్టార్ హోటల్ వెనకకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు తనకు మంచినీళ్లు కావాలని అడుగగా అదే ఆటోలో బాచుపల్లిలోని ఓ టీస్టాల్ వద్దకు తీసుకువచ్చాడు. అదే సమయంలో అటువైపు వెళుతున్న పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తించిన బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన పోలీసులు ఆటోను చేజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment