
బిల్డింగ్ పైనుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు(బనశంకరి): తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన హెచ్‌ఎస్‌ఆర్.లే ఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజాబ్ కు చెందిన గుల్షన్‌చోప్రా(29) బెళ్లందూరు ఎకో స్పేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆవరణలో ఉన్న జెన్‌ప్యాక్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వారం క్రితం సెలవుపై వెళ్లిన చోప్రా సోమవారం విధులకు హాజరయ్యాడు.
ఈక్రమంలో సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో భవనం 9 అంతస్తుపైకి ఎక్కి మరుగుదొడ్డి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తుచేపట్టారు.