ఆయనతో పాటు నిర్మాణ సంస్థ పైనా ట్రోలింగ్
కేసు నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
నిందితుడికి నోటీసులు జారీ చేసిన అధికారులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్‌మీడియా ద్వారా ఈ పని చేస్తున్న విజయ్ చంద్రహాసన్ దేవరకొండను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి పంపారు.
నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలు సేకరించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. విజయ్ చంద్రహాసన్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వివిధ సోషల్‌మీడియా ఖాతాల్లో అనేక వీడియోలు అప్‌లోడ్ చేశారు. వీటిలో మంచు విష్ణు, ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ, ‘మా’లతో పాటు సినీ రంగాన్నీ కించపరిచే, అవమానించే, అభ్యంతరకరంగా చిత్రీకరించే అంశాలను పొందుపరిచాడు.
ఇతను పదేపదే ఇదే పంథా అనుసరిస్తుండటాన్ని ‘మా’ సీరియస్‌గా తీసుకుంది. సంస్థ ట్రెజరర్ శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ కె.మధులత సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే అవసరమైన ఆధారాలను సేకరించి, న్యాయస్థానంలో చార్జ్ïÙట్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment