
కుక్కలను చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు
హైదరాబాద్ : తమిళనాడులో ఓ కుక్కను వైద్య విద్యార్థులు మేడ మీద నుంచి తోసేసిన ఘటన మరవక ముందే హైదరాబాద్ లోనూ అటువంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. మూడు కుక్కలను చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ముగ్గురు ఆకతాయిలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు కొన్ని రోజుల క్రితం ఓ కుక్కను చంపేశారు. దాన్ని వీడియో తీసి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన సైబర్ పోలీసులు ఆ మైనర్లపై కేసు నమోదు చేశారు. ఇవాళ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము సరదా కోసమే ఆ పని చేశామని వాళ్లు చెప్పడం గమనార్హం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది.