Shivasena Mp Sanjay Raut Receives Death Threat From Lawrence Bishnoi Gang - Sakshi
Sakshi News home page

ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్‌ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌ బెదిరింపు

Published Sat, Apr 1 2023 2:38 PM | Last Updated on Sat, Apr 1 2023 3:52 PM

Sivasena Mp Sanjay Raut Receives Death Threat From Lawrence Bishnoi Gang - Sakshi

ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్‌ రౌత్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం (ఏక్‌నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్‌గా పరిగణిస్తోంది’  ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్‌ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్‌ నంబరును ట్రేస్‌ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement