సాక్షి, రాంగోపాల్‌పేట్: ఓ పాత నేరస్తుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నెక్లెస్ రోడ్డులో చోటు చేసుకుంది. రాంగోపాల్‌పేట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి యాకుత్‌పురకు చెందిన చెందిన టక్కీ అలీ (25)తో పాటు మరో ఇద్దరు యువకులు పీపుల్స్ ప్లాజా సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మిగతా ఇద్దరు వ్యక్తులు అలీపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మరళీకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. దుండగులు అక్కడే వదిలివెళ్లిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు ఎవరు, హత్యకు దారితీసిన ఘటనపై. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు పాతబస్తీలో ఓ దొంగతనం కేసుతో పాటు హత్య కేసులోనూ నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment