జమ్మలమడుగు:
గుప్తనిధుల కోసం వచ్చిన ముఠాను జమ్మలమడుగు అర్బన్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు గ్రామంలో సంచరిస్తూ వివిధ దేవాలయాల గురించి ఆరా తీస్తు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక కుండా వారి వీధిలో ఉన్న రామలింగేశ్వర ఆలయం చాలా పురాతనమైనది కావడంతో ఆలయంలో గుప్త నిధులు ఉంటాయని భావించారు. శుక్రవారం రాత్రి నలుగురు వ్యక్తులు వచ్చి అందులో ఇద్దరు వ్యక్తులను ఇక్కడే పూజలు నిర్వహించాలని చెప్పి మరో ఇద్దరు తిరిగి వెళ్లిపోయారు. వీరు రాత్రి కొద్దిసేపటి వరకు పూజలు నిర్వహించారు. అయితే స్థానికులు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం పోలీసులు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వచ్చినట్లు తెలుస్తోంది. తమ దైన శైలిలో విచారణ చేయడంతో వారు మరో ఇద్దరి పేర్లను చెప్పడంతో వారిని కూడా పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు. వీరు మొదట తమది బద్వేలు ప్రాంతమని చెప్పారు. తిరిగి ప్రకాశం జిల్లా అని చెప్పడంతో ఆలయాల్లో దొంగ తనాలు చేసే ముఠానా, లేక గుప్తనిధులు తవ్వే ముఠానా
అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
గుప్త నిధుల ముఠా అరెస్ట్
Published Sat, Jul 23 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement