న్యూఢిల్లీ: పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్‌కు అంతకంతకూ ఉచ్చు బిగుస్తోంది. ‘మేడమ్ మాయ’తోపాటు ఈ ముఠాలోని నలుగురు సభ్యులను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ మేడమ్ మాయకు ప్రత్యేకమైన పనులను ఇచ్చేవాడని సమాచారం.
మేడమ్ మాయ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీనితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలను సంబంధితులకు అందజేసే పనిని మేడం మాయనే చేస్తుంటారు. గ్యాంగ్‌లో మేడమ్ మాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఏ ముఠా సభ్యునికి బెయిల్ ఇవ్వాలో, ఏ నేరస్తుని ఏ జైలు నుండి ఎక్కడికి మార్చాలో మేడమ్ మాయనే డిసైడ్ చేస్తుంటారు.
రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడమ్ మాయ ఈ ముఠాలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జైలులో ఉన్న లారెన్స్ గ్యాంగ్ సభ్యుల పూర్తి వివరాలు మేడమ్ మాయ వద్ద ఉన్నాయి. జైలులో ఉన్న నేరస్తులు అందించే సందేశాలను ఆమె స్థానిక ముఠాకు చేరవేస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న పలువురు నేరస్తులతో ఆమెకు మంచి పరిచయాలున్నాయి.
మహిళా నేరస్తురాలు మేడం మాయ అసలు పేరు సీమా అలియాస్ రేణు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఆమెను మేడమ్ మాయ అని పిలుస్తారు. మేడమ్ మాయపై జైపూర్, ఢిల్లీ, హర్యానాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠాలోని ఏడుగురు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె జైపూర్‌లో ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం..
Comments
Please login to add a commentAdd a comment