కీచకుడిపై విచారణ
Published Tue, Mar 7 2017 1:01 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
– సాక్షి కథనంపై స్పందించిన ఎస్పీ
– బాధితులను విచారిస్తున్న పోలీసులు
– నేరాలు రుజువైతే నిర్భయ, బ్రోతల్ కేసు నమోదు
కోడుమూరు : కోడుమూరు పట్టణంలో వివిధ అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచక యువకుడిపై విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన ఆ యువకుడి గురించి ‘కీచకుడు’ ఆనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై జిల్లా ఎస్పీ స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ మహేష్‌కుమార్ అతడి దురాఘాతాలపై విచారణ చేశారు. ఆ కీచకుడు గ్యాంగ్‌లో ఎవరెవరు తిరుగుతున్నారు, చేసిన నేరాలు..బాధిత అమ్మాయిలెవరు తదితర విషయాలపై పోలీసులు దృష్టిసారించినట్లు తెలిసింది. కీచకుడు పరారీలో ఉండటంతో స్నేహితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఓ యువతిపై అసభ్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన విషయం వాస్తవమైతే నిర్భయ కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. 6 నెలల క్రితమే ఆ కీచకుడి సత్ప్రవర్తన సరిగ్గాలేదన్న కారణాలు చూపి ప్రైవేట్ కాలేజీ యజమాని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అతిచిన్న వయస్సులోనే అమ్మాయిలను మభ్యపెట్టి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న కీచకుడిపై కేసు నమోదుచేసి శిక్షించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుగౌడ్, కార్యవర్గ సభ్యులు మహేష్‌బాబు, సుందర్రాజు, సోమశేఖర్ సోమవారం ఎస్‌ఐ మహేష్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు.
Advertisement
Advertisement