kichaka
-
కీచకుడిపై విచారణ
– సాక్షి కథనంపై స్పందించిన ఎస్పీ – బాధితులను విచారిస్తున్న పోలీసులు – నేరాలు రుజువైతే నిర్భయ, బ్రోతల్ కేసు నమోదు కోడుమూరు : కోడుమూరు పట్టణంలో వివిధ అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచక యువకుడిపై విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన ఆ యువకుడి గురించి ‘కీచకుడు’ ఆనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై జిల్లా ఎస్పీ స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహేష్‌కుమార్ అతడి దురాఘాతాలపై విచారణ చేశారు. ఆ కీచకుడు గ్యాంగ్‌లో ఎవరెవరు తిరుగుతున్నారు, చేసిన నేరాలు..బాధిత అమ్మాయిలెవరు తదితర విషయాలపై పోలీసులు దృష్టిసారించినట్లు తెలిసింది. కీచకుడు పరారీలో ఉండటంతో స్నేహితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఓ యువతిపై అసభ్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన విషయం వాస్తవమైతే నిర్భయ కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. 6 నెలల క్రితమే ఆ కీచకుడి సత్ప్రవర్తన సరిగ్గాలేదన్న కారణాలు చూపి ప్రైవేట్ కాలేజీ యజమాని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అతిచిన్న వయస్సులోనే అమ్మాయిలను మభ్యపెట్టి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న కీచకుడిపై కేసు నమోదుచేసి శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుగౌడ్, కార్యవర్గ సభ్యులు మహేష్‌బాబు, సుందర్రాజు, సోమశేఖర్ సోమవారం ఎస్ఐ మహేష్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. -
పోలీసుల అదుపులో కీచక ఉపాధ్యాయుడు రఫీ ?
భూపాలపల్లి : విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కీచక ఉపాధ్యాయుడిని శుక్రవారం రాత్రి భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని ఆజంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత ఏడాది 8వ తరగతి చదివిన ఓ విద్యార్థినితో అదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసే ఎండీ రఫీ చనువు పెం చుకున్నాడు. గత ఏడాది సంక్రాతి సెలవుల్లో ఆజంనగర్‌కు వెళ్లి గ్రామసమీపంలోని రైస్‌మిల్లు వద్ద సదరు విద్యార్థిని కలుసుకొని మాట్లాడుతుండగా గ్రామస్తులు గమనించా రు. అతడిని గ్రామంలోకి లాక్కెళ్లి దేహశుద్ధి చేశారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ను వెంకటాపురం మండలంలోని ఓ సంక్షేమ వసతి గృహంలో చేర్చారు. అయినప్పటికీ రఫీ తన బుద్ధిని మార్చుకోకుండా అక్కడికి Ðð ళ్లి విద్యార్థినిని కలిసేవాడు. 15 రోజుల క్రితం ఆమె ఆజంనగర్‌కు రాగా గుట్టుగా వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు కారులో హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినిని బయటకు తీసుకెళ్లేవాడు. విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బాధితురాలి సోదరుడు గతనెల 31న స్థానిక పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యా దు చేయగా రఫీపై సెక్షన్ 366, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు విష యం తెలుసుకున్న రఫీ హన్మకొండలో తల దాచుకొని శుక్రవారం రాత్రి భూపాలపల్లికి రాగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని పరకాల డీఎస్పీ సుధీంద్ర విచారిస్తున్నట్లు తెలిసింది. -
కీచక సంహారం కోసం....
మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్; పాటలు: వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, గోరటి వెంకన్న; సంగీతం: డాక్టర్ జోస్యభట్ల; కెమెరా: కమలాకర్; నిర్మాత: పర్వతరెడ్డి కిశోర్‌కుమార్; కథ- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి ఆడవారిని కేవలం ఆటవస్తువులుగా చూసే మనస్తత్త్వం నుంచి బయటపడని పురుషాధిక్య ప్రపంచం మనది. ఆడవారి పట్ల భరించలేనివెన్నో జరుగుతూ ఉంటాయి. యథార్థగాథలైనప్పటికీ అతి జుగుప్సాకరమైన అలాంటి అంశాలను సినిమా లాంటి మాస్మీడియవ్ులో ఎంతవరకు చూపించాలి?... వాటిని న్యూస్ రిపోర్ట్ స్థాయి నుంచి మూవీ ఆర్ట్ స్థాయికి ఎంతవరకు తేవాలంటే ఎప్పుడూ చర్చే. ఆ చర్చకు మరోసారి తావిస్తూ వచ్చిన సినిమా ‘కీచక’. కథగా చెప్పాలంటే... సుజాత (యామినీ భాస్కర్) హైదరాబాద్‌లో సాఫ్ట్వేరింజనీర్. టీమ్‌తో కలసి చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసే ఆమె ఈసారి ఒంటరిగా ఒక ప్రాజెక్ట్‌ను తలకెత్తుకుంటుంది. అది ఏమిటంటే - ఊళ్ళోని గాంధీనగర్ బస్తీలో ‘కీచకుడి’గా తిరుగుతున్న కోటి (జ్వాలా కోటి)ని ఎలాగైనా చంపేయడం! ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ, కోటి ఉండే పేరుమోసిన బస్తీకి వస్తుంది. ఆ బస్తీకి 20 ఏళ్ళుగా మకుటం లేని మహారాజు - కోటి. వంద మర్డర్లు, 300 రేప్‌లు చేసిన చరిత్ర అతనిది. అయితే, భయంతో బస్తీవాసులు, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల పోలీసులు - అతణ్ణి ఏమీ చేయలేకపోతుంటారు. బస్తీకి ఒక సామాన్య మహిళగా వచ్చిన హీరోయిన్‌కు అతని మీద అంత పగ ఎందుకు అన్నది చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. మరోపక్క ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు విలన్. అతణ్ణి ఏమారుస్తూనే, బస్తీలో అందరి ఎదుటే అతణ్ణి ఎదిరిస్తుంది హీరోయిన్. ఆమె ఇచ్చిన ధైర్యంతో జనమేం చేశారన్నది మిగతా స్టోరీ. ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్... పాత్రధారులిద్దరూ ఆ పాత్రలకు తగ్గట్లు, చూడడానికి బాగున్నారు. క్రూరమైన విలన్ పాత్రకు జ్వాలా కోటి సరిగ్గా సరిపోయారు. సైకిల్ మీద క్యారియర్‌లో ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపు, ఆయన నటన బాగున్నాయి. పరిమితమైన వనరులతో తీసిన ఈ సినిమాకు ఉన్నంతలో కెమేరా, రీరికార్డింగ్ వర్క బాగున్నాయి. సినిమా మొదలైన కాసేపటికే హీరోయిన్ లక్ష్యమేమిటో, దానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో, తరువాతంతా లక్ష్యాన్ని ఆమె ఎలా చేరుకుందన్నదే! దాన్ని ఆసక్తిగా చెప్పాల్సింది. మళ్ళీ మళ్ళీ అవే తరహా రేప్ దృశ్యాలు, నేపథ్య గీతాలు, ఒక ప్రత్యేక నృత్య గీతం, ఇంకా విలన్ ముఠా మాటలు, చేష్టలతో సినిమాను 111 నిమిషాల నిడివికి చేర్చారు. చిత్రంగా, విలన్‌ను చంపడమే ధ్యేయంగా కత్తి పట్టుకు తిరిగిన కథానాయిక ఆఖరుకి అదే కత్తితో విలన్ చేతిలో పోట్లు తింటుంది. అంతటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బస్తీకి పోగానే, ఆటోడ్రైవర్‌తో ప్రేమలో మునగడంలో లాజిక్ వెతకడం కన్నా సినిమాటిక్ సృజన అని తృప్తిపడిపోతే గొడవుండదు. అత్యాచారానికి గురైన స్త్రీ ఆ దుర్మార్గానికి పాల్పడిన విలన్‌పై పగ తీర్చుకోవడమనే ఫార్ములా తాతల కాలం నాటిదే. కాకపోతే దాన్ని నిజజీవిత ఘటనకూ, స్త్రీ చైతన్యానికీ ముడిపెట్టడమే తాజాదనం. సీను సీనుకీ రేప్ దృశ్యం, సైకో తరహా శాడిజమ్, అనేకానేక ఆడియో కట్స్‌తో మనసును డిస్ట్రబ్ చేసే సంఘటనల సమాహారం ‘కీచక’. నాగపూర్ ప్రాంతంలో అక్కూ యాదవ్ అనే వీధి రౌడీ జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథను అల్లుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు ఒకప్పుడు టీవీ చానల్స్‌లో పనిచేసిన జర్నలిస్టు -
'కీచక' మూవీ స్టిల్స్