పోలీసుల అదుపులో కీచక ఉపాధ్యాయుడు రఫీ ?
Published Sat, Sep 3 2016 12:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
భూపాలపల్లి : విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కీచక ఉపాధ్యాయుడిని శుక్రవారం రాత్రి భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని ఆజంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత ఏడాది 8వ తరగతి చదివిన ఓ విద్యార్థినితో అదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసే ఎండీ రఫీ చనువు పెం చుకున్నాడు. గత ఏడాది సంక్రాతి సెలవుల్లో ఆజంనగర్‌కు వెళ్లి గ్రామసమీపంలోని రైస్‌మిల్లు వద్ద సదరు విద్యార్థిని కలుసుకొని మాట్లాడుతుండగా గ్రామస్తులు గమనించా రు.
అతడిని గ్రామంలోకి లాక్కెళ్లి దేహశుద్ధి చేశారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ను వెంకటాపురం మండలంలోని ఓ సంక్షేమ వసతి గృహంలో చేర్చారు. అయినప్పటికీ రఫీ తన బుద్ధిని మార్చుకోకుండా అక్కడికి Ðð ళ్లి విద్యార్థినిని కలిసేవాడు. 15 రోజుల క్రితం ఆమె ఆజంనగర్‌కు రాగా గుట్టుగా వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు కారులో హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినిని బయటకు తీసుకెళ్లేవాడు. విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బాధితురాలి సోదరుడు గతనెల 31న స్థానిక పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యా దు చేయగా రఫీపై సెక్షన్ 366, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు విష యం తెలుసుకున్న రఫీ హన్మకొండలో తల దాచుకొని శుక్రవారం రాత్రి భూపాలపల్లికి రాగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని పరకాల డీఎస్పీ సుధీంద్ర విచారిస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement