చైన్ స్నాచింగ్ ముఠా సభ్యుడు అరెస్టు
ఆదోని పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాలోని ప్రధాన సభ్యుడు షేక్ సుల్తాన్‌జాప్రే అలియాస్ షేక్ మలాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆదోని టౌన్: ఆదోని పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాలోని ప్రధాన సభ్యుడు షేక్ సుల్తాన్‌జాప్రే అలియాస్ షేక్ మలాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన ఇరానీ గ్యాంగ్ ముఠా ఆదోనిలో 2015–16లో పలు వీధుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.
గోవాలో కూడా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి సెంట్రల్ జైలులో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. ఈ మేరకు అక్కడి పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించి ప్రధాన నిందితుడు షేక్ సుల్తాన్ జాప్రేను ఆదోనికి తీసుకువచ్చి విచారించడంతో నిందితుడు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. చైన్ స్నాచింగ్ కేసుల్లో గతంలో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.షేక్ సుల్తాన్ నుంచి 40 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. చైన్ స్నాచింగ్ కేసుల్లో పురోగతి సాధించిన త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, సునీల్, సిబ్బంది రవి, ఎలెసాను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.