కవ్వించి... కత్తితో బెదిరించి | gang arrested in robbery case | Sakshi
Sakshi News home page

కవ్వించి... కత్తితో బెదిరించి

Published Fri, Jun 24 2016 3:10 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

కవ్వించి... కత్తితో బెదిరించి - Sakshi

కవ్వించి... కత్తితో బెదిరించి

నగదు అపహరించిన దుండగులు
కటకటాల్లోకి ముగ్గురు మహిళలు, యువకుడు

 నిజామాబాద్ కైం :  కవ్వించి, కత్తితో బెదిరించి నగదు దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకటవ టౌన్ ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం లింగంపల్లికి చెందిన మన్నే బాబయ్య బుధవారం కుల సంఘం పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చాడు. పని పూర్తయ్యాక తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లోని కామారెడ్డి బస్టాప్ వద్ద వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో నగరంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మహిళలు డొక్క రాణి, డొక్క సరస్వతి, సాదుల స్వప్న, బాబయ్యకు సైగలు చేసి బస్టాండ్ వెనుక రైల్వే కాంపౌండ్ ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ రాణి భర్త యుగంధర్ తోడయ్యాడు. నలుగురు కలిసి బాబయ్యను కత్తితో బెదిరించి అతని వద్దనున్న రూ.1600 తీసుకొని, పరారయ్యారు. బాధితుడు అర్ధరాత్రి ఒకటో టౌన్ ఠాణాకు వచ్చి జరిగిన ఫిర్యాదు చేశాడు.పోలీసులు గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబయ్యను తీసుకుని బస్టాండ్ వద్దకు వచ్చారు. అక్కడ నలుగురు మరికొంత మందిని మోసం చేసేందుకు తిరుగుతుండటంతో బాబయ్యను వారిని గుర్తు పట్టాడు. పోలీసులు వారిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement