
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో కాల్‌గర్ల్ పేరుతో డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనుక నెట్టారు. కేసుకు సంబంధించి యువతితో పాటు మొత్తం ఏడుగురిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బన్నేరుఘట్ట రోడ్డు దేవర చిక్కనహళ్లి వద్ద యువతితో మంజునాథ్, రజనీకాంత్ నిలబడ్డారు. ఈ సమయంలో అక్కడికి నాలుగు బైకుల్లో వచ్చిన గ్యాంగ్ కారును డీకొట్టారని మంజునాథ్, రజనీకాంత్‌తో గొడవకు దిగారు. అనంతరం కొద్దిక్షణాల్లో వచ్చిన మరికొందరు వీరి కారులోనే కిడ్నాప్ చేశారు.
కోళిఫారం గేట్ వద్ద మంజునాథ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ విషయం అలర్ట్ అయిన పోలీసులు సమాచారం ఆధారంగా అపహరణకు గురైన రజనీకాంత్‌ను కాపాడారు. ప్రముఖ ఆరోపి తిరుమలేశ్‌తో పాటు నవీన్, కెంపరాజు, ముఖేశ్, మంజునాథ్, దలి్వర్‌సావుద్, యువతిని అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతి కాల్‌గర్ల్ అనే విషయం తెలిసింది.
కిడ్నాపర్లకు సమాచారం ఇచ్చిన ముఠా యువతి:
మంజునాథ్, రజనీకాంత్ యువతిని బుక్ చేశారు. అర్దరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. యువతి ముందే వీరు ఉన్న స్థలం గురించి కిడ్నాపర్లకు సమాచారం అందించింది. ముగ్గురు కలిసి నిర్జీన ప్రాంతంలో ఉండగా వచ్చిన ముఠా ఇద్దరిని అపహరించారు. మంజునాథ్, రజనీకాంత్ ముందు యువతి కూడా అపహరణకు గురైనట్లు నటించింది. అన్ని అనుకున్న ప్రకారం యువతి, ఆమె గ్యాంగ్ ఇద్దరిని అపహరించారు.
కానీ కారు కోళీఫారం గేట్ వద్దకు వెళ్లగానే మంజునాథ్ తప్పించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం తెలిపాడు. అపహరించిన కిడ్నాపర్లు మండ్య, మైసూరు ద్వారా నంజనగూడుకు వెళ్లారు. రజనీకాంత్ విడుదలకు రూ.5 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిడ్నాపర్లు అందరిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment