FastTrack
-
ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అమ్మే ముఠా అరెస్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫేక్ ఫాస్ట్‌ట్రాక్(Fastrack) వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అంటూ సాధారణ వాచ్‌లను అధిక రెట్లకు విక్రయిస్తున్నారు. ముఠా వద్ద కోటి రూపాయల విలువైన 6వేలకుపైగా ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో సభ్యులైన ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో చార్మినార్ పరిసరాల్లో వాచ్‌లను ముఠా అమ్ముతోంది. వాచ్‌లు అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతలో ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ముఠా యత్నించినట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండెడ్ వస్తువులకు నకిలీవి సృష్టించి అమ్మినట్లే ఫాస్ట్‌ట్రాక్ వాచ్లకు కూడా ఫేక్ వాచ్‌లను తయారుచేసి లాభాలు ఆర్జింజేందుకు ప్రయత్నించి పోలీసులకు ముఠా సభ్యులు చిక్కారు. -
ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’
పనుల్లో వేగం పెంచాలని అధికారులకు హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పదహారేళ్లుగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందన్న ఆయన, ఇకపై పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఇక్కడ జలసౌధలో ఆయన దేవాదుల పనులను సమీక్షించారు. ప్యాకేజీల వారీగా భూసేకరణ, నిర్మాణ పనులపై ఆరా తీశారు. వచ్చే ఖరీఫ్ నా టికి నర్సంపేట, ములుగు, భూపాల పల్లి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరివ్వాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేవాదుల పనులపై తనకు రోజూ నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భూసేకరణపై సమీ క్షించాలని జనగామ కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లో రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 123జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. 2018 కల్లా దేవాదుల మూడో దశ పూర్తి చేయా లన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నిధులి స్తోందని, 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రా నికి స్పష్టంగా హామీ ఇచ్చిందని తెలిపా రు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిటైర్డు తహసీల్దార్లను ఔట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కంతనపల్లిపైనా సమీక్ష కంతనపల్లి బ్యారేజీ పురోగతిని కూడా మంత్రి హరీశ్‌రావు సమీక్షిం చారు. 2017 డిసెంబర్‌కల్లా నీరందిం చేలా చూడాలని, రెండేళ్లలో ఈ బ్యారేజీని పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పంప్ హౌస్‌లు పూర్తి కాకుండా మోటార్లు, ఇతర పరికరాలు సమకూర్చుకో రాదని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. పౌరసరఫరాల కార్పొ రేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఈఎన్ సీలు మురళీధర రావు, విజయ ప్రకాశ్, దేవాదుల చీఫ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ కేసును ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో విచారిస్తాం
స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఇకపై ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే వారానికి రెండుసార్లు కూడా విచారణ చేపడతామని తెలిపింది. డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తమ ఆస్తులను డెవలప్మెంట్కు ఇచ్చి తద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు చెల్లిస్తామని అగ్రిగోల్డ్ ప్రతిపాదించిన నేపథ్యంలో.. తాకట్టు రహితంగా ఉన్న ఆస్తుల వివరాలు, వాటి విలువ, కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలు.. కొనుగోలుదారులు కోరుతున్న గడువు తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. దానిని పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన వెనుక అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉద్దేశాలను కూడా చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.