ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’ | 'devadula' In fast-track | Sakshi
Sakshi News home page

ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’

Published Tue, Nov 8 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’

ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’

పనుల్లో వేగం పెంచాలని అధికారులకు హరీశ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పదహారేళ్లుగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందన్న ఆయన, ఇకపై పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఇక్కడ జలసౌధలో ఆయన దేవాదుల పనులను సమీక్షించారు. ప్యాకేజీల వారీగా భూసేకరణ, నిర్మాణ పనులపై ఆరా తీశారు. వచ్చే ఖరీఫ్ నా టికి నర్సంపేట, ములుగు, భూపాల పల్లి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరివ్వాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు మంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో దేవాదుల పనులపై తనకు రోజూ నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భూసేకరణపై సమీ క్షించాలని జనగామ కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లో రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 123జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. 2018 కల్లా దేవాదుల మూడో దశ పూర్తి చేయా లన్నారు.

దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నిధులి స్తోందని, 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రా నికి స్పష్టంగా హామీ ఇచ్చిందని తెలిపా రు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిటైర్డు తహసీల్దార్లను ఔట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.  
 
కంతనపల్లిపైనా సమీక్ష
కంతనపల్లి బ్యారేజీ పురోగతిని కూడా మంత్రి హరీశ్‌రావు సమీక్షిం చారు. 2017 డిసెంబర్‌కల్లా నీరందిం చేలా చూడాలని, రెండేళ్లలో ఈ బ్యారేజీని పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పంప్ హౌస్‌లు పూర్తి కాకుండా మోటార్లు, ఇతర పరికరాలు సమకూర్చుకో రాదని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. పౌరసరఫరాల కార్పొ రేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఈఎన్ సీలు మురళీధర రావు, విజయ ప్రకాశ్, దేవాదుల చీఫ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు, ఓఎస్డీ  శ్రీధర్‌రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement