400 కిలోల గంజాయి పట్టివేత
Published Fri, Sep 23 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం పెద్దలోతిలి పంచాయతీ కప్పలగడ్డలోని ఓ ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉండే చింద్రి శివాజీ అనే వ్యక్తి ఇంట్లో ఈ గంజాయి లభించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement