నందిగాం: ఓ బొలేరో వాహనం అల్లం బస్తాల లోడుతో ఎంచక్కా చెక్ పోస్టులు దాటేస్తూ వెళ్లిపోతోంది. ఎవరికీ ఎక్కడా అనుమానం రాలేదు. ఇంకాసేపు అయితే జిల్లా కూడా దాటేసేదే. కానీ నందిగాం మండలం పాలవలస పేట వద్దకు వచ్చే సరికి టైరు పేలి బండి బోల్తా పడింది. ఇంకేముంది గుట్టు కాస్తా రట్టయిపోయింది. సాయం చేద్దామని వాహ నం దగ్గరకు వచ్చిన వారికి అల్లం బస్తాలతో పాటు గంజాయి కనిపించడంతో అసలు విషయం బయటపడింది. మొత్తం 386 కిలోల గంజాయి దొరికింది. జనాలను చూసిన డ్రైవర్, క్లీనర్లు పొలాల గుండా పరుగులు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టెక్కలి వైపు నుంచి పలాస వైపు వెళ్తున్న ఎంపీ 13 జీఓ 6427 నంబర్ గల బొలేరో పికప్ బండి బుధవారం నందిగాం మండలం పాలవలస పేట వద్ద వెనుక టైర్ పేలిపోవడంతో జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న అల్లం బస్తాలు రోడ్డు మీద పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వారు సాయం అందించేందుకు అక్కడకు చేరుకోగా.. డ్రైవర్, క్లీనర్‌లు చిన్న చిన్న గాయాలతో పొ లాల మీదుగా పరుగులు పెడుతూ కనిపించారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బస్తాలను ప రిశీలించి చూస్తే అల్లంతో పాటు గంజాయి బస్తాలు కనిపించాయి.
వెంటనే వారంతా నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ లోగా డ్రైవర్, క్లీనర్లు మళ్లీ వ్యాన్ వద్దకు వచ్చి వాహనంలో ఉన్న బ్యాగ్ తీసుకుని మళ్లీ పారిపోయారు. నంది గాం ఎస్‌ఐ మహమ్మద్ యాసిన్ సంఘటన స్థలం వద్దకు చేరుకొని చెల్లా చెదురుగా పడి ఉన్న బస్తాలను తహసీల్దార్ ఎన్.రాజారావు సమక్షంలో స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొ త్తం 13 బస్తాల్లో 386 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేయగా కాశీబుగ్గ సీఐ ఎస్.శంకరరావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యాన్ మధ్యప్రదేశ్ వాసిదిగా గుర్తించామన్నారు. డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment