
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు బయటపడింది. అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఇటీవల రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీరామ్ పాత్రపై విచారణ జరుపుతున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణతో సీఐకి ఉన్న సంబంధాలపై ఆబ్కారీ ఆరా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణని వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరారు. గతంలో సీఐ, కానిస్టేబుల్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో.. సీఐ శ్రీరాంపై అనంతపురం రేంజ్ డీజీఐ బదిలీ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment