
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: సుమారు రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ర్ట వెళ్తున్న రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. రామవరప్పాడు వద్ద ఒక కారు దొరకగా..పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ పోయిన మరో కారును ఇబ్రహీంపట్నం వద్ద చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు కార్లలో కలిపి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నలుగురూ మహారాష్ర్టకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment