కాకినాడలో గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠాను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు.
గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠా అరెస్ట్
Jul 19 2017 11:48 AM | Updated on Oct 9 2018 7:52 PM
కాకినాడ: కాకినాడలో గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠాను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆ ముఠా నుంచి భారీగా గంజాయి, మెడికల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవాడ రవి, శివప్రసాద్, భీమరాజు, రమణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 25 కేజీల గంజాయి, 189 బాటిల్స్ టాసెక్స్, 197 బాటిల్స్ ఎస్‌కాఫ్ 3,465 నిట్రోవిట్ టాబ్లెట్స్, 170 నిట్రోసిన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా... డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా నియంత్రిత మత్తు మందులు అమ్మిన మూడు మెడికల్ షాపుల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement