70 కిలోల గంజాయి స్వాధీనం
Published Wed, Aug 17 2016 12:23 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
పాడేరు,చింతపల్లి: పాడేరు, చింతపల్లి మండలాల్లో పోలీసులు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద రవాణా చేసేందుకు సిద్ధం చేసిన 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రంలో సోనీపట్ ప్రాంతానికి చెందిన అజయ్, వై.రాయత్, అమిత్‌ఠాఠీ, గోలు అనే నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు పాడేరు ఎక్సైజ్ సీఐ ఎం.రాజారావు తెలిపారు. అలాగే చింతపల్లి మండలం గడపరాయికి చెందిన కొర్రా కామేశ్వరరావు, కొర్రా నాగేశ్వరరావు, గెమ్మెలి కొండబాబు అనే ముగ్గురు గిరిజనులను అరెస్ట్ చేసి 30 కిలోల గంజాయిన స్వాధీనం చేసుకున్నట్టు ట్రైనీ ఎస్‌ఐ విభూషణరావు తెలిపారు.
Advertisement
Advertisement