
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో జోరుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. గాదంకి టోల్ ప్లాజా దగ్గర ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. అయితే స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డిక్కీలో నుంచి రెండు పార్సిల్స్ కింద పడ్డాయి. పోలీసులు వాటిని తనిఖీ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. అది రెండు కేజీల దాకా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కారు వెళ్లిన దృశ్యాలు నమోదు కాగా.. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment