టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్‌కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది.
నిందితుడు స్పెన్సర్ బోస్టన్
Comments
Please login to add a commentAdd a comment