court judge
-
హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్‌లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
కష్టం వృథా కాలేదు.. కూలి కుమారుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని మారుమూల మూగుపురం గ్రామానికి చెందిన కొంకాడ రమేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మార్చి 29న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రమేష్ తండ్రి పురుషోత్తుకర్ర గ్రామానికి చెందిన ఆదినారాయణ, తల్లి మాణిక్యమ్మ. తల్లిదండ్రుల మధ్య మనస్ఫర్థల కారణంగా రమేష్ చిన్నప్పటి నుంచి తల్లితోనే మూ గుపురంలో పెరిగారు. మాణిక్యమ్మ కూలి పనులు చేసుకుంటూ రమేష్‌ను చదివించారు. రమేష్ ఒకటి నుంచి 7వ తరగతి వరకు టెక్కలి గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. ఇంటర్‌ను మెళియాపుట్టి మండలం పెద్దమడి రెసిడెన్షియల్ కళాశాలలో 2006లో పూర్తి చేశారు. తూముకొండ గ్రామానికి చెందిన తన చిన్నాన్న, పిన్ని రవికుమార్, వజ్రంల సహకారంతో 2009లో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అనంతరం 2009–11లో విశాఖపట్నంలో ఎంబీఏ పూర్తి చేసి అనంతరం బీఎల్‌ను ఆంధ్రా యూనివర్సిటీలో 2015లో పూర్తి చేశారు. బీఎల్ పూర్తి చేశాక జడ్జి కావాలనే పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ పడిన సమ యంలో దరఖాస్తు చేశారు. అలా రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడకుండా 2020లో వెలువడిన నోటికేషన్లో ద రఖాస్తు చేసి రోజుకు సుమారు 20 గంటల పాటు కృషి చేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి 2022 మార్చి 29న విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సర్పంచ్ షణ్ముఖరావు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్ చేయడంతో... -
వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు
టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్‌కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నిందితుడు స్పెన్సర్ బోస్టన్ -
తీర్పు చెప్పి.. తుపాకీతో..
బ్యాంకాక్: అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తి థాయ్‌లాండ్ న్యాయవ్యవస్థలో అడుగడుగునా వచ్చే అడ్డంకుల్ని సహించలేకపోయారు. కిక్కిరిసిపోయిన కోర్టు హాలు సాక్షిగా దేశ న్యాయవ్యవస్థలో లోటుపాట్లను చీల్చి చెండాడుతూ తనని తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఉగ్రవాదం వెర్రి తలలు వేసే దక్షిణ థాయ్‌లాండ్‌లోని యాలా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనకోర్న్ పియాన్చన ఒక హత్యా కేసులో నిందితుల్ని నిర్దోషులుగా తీర్పు చెప్పిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఫేస్బుక్ లైవ్‌లో న్యాయవ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆ తర్వాత తన దగ్గరున్న తుపాకీతో ఛాతీలో కాల్చుకున్నారు. వెంటనే కోర్టు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి ఛాతీలో దిగిన గుళ్లను బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యాయమూర్తి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. థాయ్ సమాజంలో ధనబలం, కండబలం ఉన్నవారికి కోర్టులు అనుకూలంగా ఉంటాయని, సాధారణ పౌరులైతే చిన్నా చితక నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే ఒక న్యాయమూర్తి ఇలా వ్యవస్థను నిందించడం ఇదే తొలిసారి. ఒక హత్య కేసులో ముస్లింలైన అయిదుగురు నిందితుల్ని విముక్తుల్ని చేస్తూ తీర్పు చెప్పిన పియాన్చన న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ‘ఎవరికైనా శిక్ష విధించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. అలా లేవని అనిపిస్తే వారిని విముక్తిల్ని చేయాలి. ఒక నిర్దోషికి ఎన్నడూ శిక్షపడకూడదు. వారిని బలిపశువుల్ని చేయకూడదు‘‘ అని అన్నారు. ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన ఆ అయిదుగురికి శిక్షలు వేయాలంటూ పియాన్చనపై ఒత్తిళ్లు వచ్చాయని, సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష విధించలేని ఆయన తీర్పు చెప్పిన తర్వాత తనని తాను కాల్చుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైçపు న్యాయశాఖ అధికారులు న్యాయమూర్తి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకు వ్యక్తిగత సమస్యలే కారణమని అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఈ పని చేశారో విచారణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
బాలిక నాలుక కట్ చేసిన మహిళ
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని బంటుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ కుటుంబాన్ని బంధువులు చిత్రహింసలు పెడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ బ్రహ్మం గత సంవత్సరం మరణించాడు. దీంతో అతడి వదిన ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు చేసే పనులను మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు పోలీసులు అప్పగించారు. కోపం పెంచుకున్న ఆదిలక్ష్మి తరపువారు బ్రహ్మం కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. మైనర్ బాలిక అయిన కానిస్టేబుల్ కూతురిని ఆదిలక్ష్మి చిత్రహింసలు పెట్టి, నాలుక కోసేసింది. అంతటితో అగకుండా కానిస్టేబుల్ భార్య చేత బంటుపల్లి బస్టాండ్‌లో ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. భర్త మరణించిన అనంతరం ఆమెకు ఫెన్షన్ రూపంలో వచ్చిన 17 వేల రూపాయల నగదును కూడా అన్న వేణు, వదిన ఆదిలక్ష్మిలు లాగేసుకున్నారు. కానిస్టేబుల్ కూతురు స్థానికుల సహాయంతో నిన్న(మంగళవారం) బంటుపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ బాలిక కోర్టు జడ్జి ఎస్. విజయ్ చంద్రను ఆశ్రయించింది. జడ్జి చొరవతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వివక్షే అతి పెద్ద నేరం
సాక్షి, సిద్దిపేట: ‘పిల్లలకు ఎంత ఆస్తి ఇవ్వాలి.. వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి.. అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ, మా అమ్మానాన్నలు అందుకు విరుద్ధం. తమ వారసులను ఎలా తయారుచేయాలో ఆలోచించారు. స్థిరచరాస్తులకే కాదు.. ఇంట్లోని గది నిండా ఉండే పుస్తకాలకూ వారసులు ఉండాలని భావించారు. ఈక్రమంలో అమ్మానాన్నల నుంచి అందిపుచ్చుకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, భర్త ప్రోత్సాహం.. నన్ను న్యాయమూర్తిగా నిలబెట్టింది. అమ్మే నాకు ఆదర్శం.. నాన్న పుస్తకాలకు వారసురాలిగా నా న్యాయవాద వృత్తిని ప్రారంభించా..’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గూడ అనూష తెలిపారు. అమ్మానాన్నల కలలను సాధించడం నుంచి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సక్సెస్ అయిన వైనం.. తల్లిదండ్రుల పెంపకం.. మహిళా సాధికారత.. బాధ్యతలు మొదలైన అంశాలపై ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆమె మాటల్లోనే వివరాలు.. గది నిండా పుస్తకాలే.. మాది వరంగల్ పట్టణం. అమ్మ అమృతమ్మ, నాన్న యాదగిరిశర్మ న్యాయవాదులే. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద చట్టాలు, న్యాయాలు, కేసులు పరిష్కారాలు మాకు వినిపించేవి. కొత్త పుస్తకాలు వస్తే చాలు అమ్మానాన్నలు పోటీ పడి కొని మరీ ఇంటికి తెచ్చేవారు. ఇలా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అయితే, వాటికి వారసులు ఎవరు? అనేది వారి ప్రశ్న. నేను, తమ్ముడు రవిశర్మ.. ఇద్దరం ఇతర చదువులతో పాటు న్యాయవాద కోర్సు పూర్తి చేశాం. అమ్మానాన్నలు మమ్మల్ని జడ్జీలుగా చూడాలని అనుకునేవారు. ఈ విషయం అమ్మ నాకు చెబుతూ ఉండేది. వారి కోరిక తీర్చడంతో పాటు పుస్తకాలకు వారసురాలిగా ఉంటానని ఏదో సరదాగే చెప్పేదాన్ని. కానీ, అవే మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. నా ఆలోచనకు భర్త ప్రోత్సాహం నా భర్త అనికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సమాజాన్ని చదివిన మనిషి. నేను బీటెక్ చదివి లా కోర్సు చేసిన వెంటనే వివాహమైంది. ఆయనది బెంగుళూర్లో ఉద్యోగం. మా కుటుంబ పరిస్థితి.. వాతావరణం చూసిన ఆయన న్యాయమూర్తి కావాలనే నా ఆలోచనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. నన్ను మరింత ప్రోత్సహించారు. నా పెద్ద కుమారుడు సాయిసిద్దార్థ 18 నెలల వయస్సునప్పుడు ఆయాతో కలిసి హైదరాబాద్‌కు కోచింగ్‌కు వచ్చా. నేనెలా చదువుతున్నానో? ఆయన ప్రతిరోజు ఆరా తీసేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను న్యాయమూర్తి పోటీ పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్ సాధించగలిగాను. సంస్కృతి, సంప్రదాయాలతో ఆత్మవిశ్వాసం సంస్కృతి, సంప్రదాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచుతాయి. పూజలు, ఉపవాసాలు, పండుగలు ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతాయి. వాటిని ఏనాడు విస్మరించవద్దు. అయితే, అందులో ఉన్న మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. సర్వమానవాళి అభివృద్ధికి దోహదపడేందుకు ఎందరో మహానుభావులు చెప్పిన మాటలు, సూక్తులు స్వీకరించాలి. వాటిని మన జీవన మనుగడకు, తోటివారికి సహాయం చేసేందుకు వినియోగించాలి. అలాగే కట్టుబాట్లు, సామాజిక ఆచారాల ద్వారా ఇతరులను నొప్పించడం, ఇబ్బంది పెట్టకూడదు. అమ్మే నా రోల్ మోడల్ అమ్మే నా రోల్ మోడల్. పేరెంట్స్ ఇద్దరు న్యాయవాదులే. వారి కుటుంబ పరిస్థితి.. పడిన కష్టాలు.. సమాజంలో గుర్తింపులు.. మొదలైన విషయాలు మాకు ఎప్పుడు చెబుతుండేది. వారి న్యాయమూర్తుల గురించి చెబుతూ.. వారిచ్చిన తీర్పులు చర్చించే సమయంలో మేము కూడా న్యాయమూర్తులు అయితే బాగుంటుందని నాన్న పదేపదే చెప్పేవారు. ఆయన మాటలే నన్ను న్యాయమూర్తి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశాయి. దీనికి తోడు స్వామి వివేకానంద ‘హన్మంతుడు’ పుస్తకం, పాల్కో రచించిన ‘ది ఆల్కమిస్ట్’ పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. సమయం దొరికనప్పుడు పుస్తకాలు చదవడం నా హాబీ. అందులో మనకు కావాల్సిన అంశాలుంటే రాసుకుంటాను. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే.. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే. నేను, తమ్ముడు ఇద్దరం పోటీ పడి చదివేవాళ్లం. మా పెంపకంలో ఎక్కడా తల్లిదండ్రులు వివక్ష చూపలేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సమానంగా చూడాలి. ప్రస్తుతం మగవారి కన్నా ఆడపిల్లలే బాధ్యతగా చదువుతున్నారు. వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష. పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీరి రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించిన వారిపైనా చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పట్టుదల ఉంటే విజయం ఆడపిల్లలు.. మహిళలు ఎక్కడా తక్కువ కాదు. మేం తక్కువ అనే భావన తీసేయాలి. ఆడవాళ్లను భూమాతతో పోల్చుతారు. అంటే అంత సహనం ఉంటుందని అర్థం. అందుకే ఓపికతో పెంచుకోవాలి. లక్ష్యం ఎన్నుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలి. అంతేకానీ, నిరాశతో ఉంటే విజయం సాధించలేవు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఎన్నుకున్న రంగంలో రాణించాలి. -
అందరూ భాగస్వాములు కావాలి
జిల్లా జడ్జి నాగమారుతిశర్మ టవర్‌సర్కిల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కోర్డు జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా చెట్ల పెంపకం చేపట్టడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు వారసులని, మొక్కలకు తమ పేర్లను పెట్టుకొని బాధ్యతతో పెంచాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మూడు మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములయితేనే ఫలితం పొందుతామని సూచించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించనప్పుడే నగరంలో కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. అనంతరం మొక్కలను నాటి, విద్యార్థులకు, స్థానికులకు మొక్కలు, ట్రీగార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవో చంద్రశేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కేవీ.రమణాచారి, కార్పొరేటర్లు ఎడ్ల సరితఅశోక్, వై.సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, ఏవీ.రమణ, మెండి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారధి కళాభారతి బృందం మొక్కల పెంపకంపై ఆలపించిన గీతాలు అలరింపజేశాయి. హరితోద్యమంలో భాగస్వాములు కావాలి : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించినపుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ క్వార్టర్స్‌లో కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వార్టర్స్ ఆవరణ, రోడ్డుకిరువైపులా 300 మొక్కలు నాటారు. చెట్లు లేని ప్రపంచాన్ని ఊహించలేమని, ఇప్పటికే చెట్ల సంఖ్య తగ్గడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నదని ఉమ పేర్కొన్నారు. అందుకే సీజన్లో వర్షాలు కురవకపోవడం, అకాల వర్షాలు పడడం జరుగుతుందన్నారు. భవిష్యత్ ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్ ప్రజా ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టారని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, కార్పొరేటర్ యాదగిరి సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు. కదిలిన జిల్లా యంత్రాంగం ముకరంపుర : హరితహారంలో భాగంగా ఆయా శాఖల అధికారులు మొక్కలు నాటేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. నగరంలోని వెటర్నరీ పాలిక్లినిక్‌లో 50 మొక్కలను ఒక ప్లాటుగా.. 200 మొక్కలు పాలిక్లినిక్ ప్రహారీ చుట్టూ నాటారు. ముఖ్య అతిథిగా సీపీవో సుబ్బారావు, పశుసంవర్దకశాఖ జేడీ రాంచందర్, డీడీలు షేక్ ఖలీల్ రహ్మాన్, వెంకటేశ్వర్లు, కిషన్, కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మొక్కలు నాటారు. మార్కెటింగ్ శాఖ డీడీఎం కృష్ణయ్య, సిబ్బంది. కార్పొరేటర్లు పాల్గొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ ఉద్యానక్షేత్రంలో ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటా రు. ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, ఏడీ జ్యోతి, అసిస్టెంట్ పీడీ మధుసూధన్ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఐసోటీం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను ఉచితంగా అందజేస్తూ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. హౌసింగ్ పీడీ నర్సింగరావు మొక్కను తీసుకుని పేరు నమోదు చేసుకున్నారు. వయోజన విద్య ఉపసంచాలకుల కార్యాలయంలో మొక్కలు నాటారు. ఉపసంచాలకులు ఎం.జయశంకర్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, ఏపీవో దేవదాస్, పర్యవేక్షకులు వి.రాజేందర్ఱావు, ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్మండ్ కంట్రీ జిల్లా అటార్నీగా ఆమె పనిచేశారు. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మహిళకు ఇంతటి గౌరవం దక్కడం గర్వంగా ఉందని రాజరాజేశ్వరి తెలిపారు.