సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని బంటుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ కుటుంబాన్ని బంధువులు చిత్రహింసలు పెడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ బ్రహ్మం గత సంవత్సరం మరణించాడు. దీంతో అతడి వదిన ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు చేసే పనులను మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు పోలీసులు అప్పగించారు. కోపం పెంచుకున్న ఆదిలక్ష్మి తరపువారు బ్రహ్మం కుటుంబ సభ్యులపై దాడికి దిగారు.
మైనర్ బాలిక అయిన కానిస్టేబుల్ కూతురిని ఆదిలక్ష్మి చిత్రహింసలు పెట్టి, నాలుక కోసేసింది. అంతటితో అగకుండా కానిస్టేబుల్ భార్య చేత బంటుపల్లి బస్టాండ్‌లో ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. భర్త మరణించిన అనంతరం ఆమెకు ఫెన్షన్ రూపంలో వచ్చిన 17 వేల రూపాయల నగదును కూడా అన్న వేణు, వదిన ఆదిలక్ష్మిలు లాగేసుకున్నారు.
కానిస్టేబుల్ కూతురు స్థానికుల సహాయంతో నిన్న(మంగళవారం) బంటుపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ బాలిక కోర్టు జడ్జి ఎస్. విజయ్ చంద్రను ఆశ్రయించింది. జడ్జి చొరవతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment