
ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ క్వార్టర్స్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.