సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని మారుమూల మూగుపురం గ్రామానికి చెందిన కొంకాడ రమేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మార్చి 29న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రమేష్ తండ్రి పురుషోత్తుకర్ర గ్రామానికి చెందిన ఆదినారాయణ, తల్లి మాణిక్యమ్మ. తల్లిదండ్రుల మధ్య మనస్ఫర్థల కారణంగా రమేష్ చిన్నప్పటి నుంచి తల్లితోనే మూ గుపురంలో పెరిగారు. మాణిక్యమ్మ కూలి పనులు చేసుకుంటూ రమేష్‌ను చదివించారు. రమేష్ ఒకటి నుంచి 7వ తరగతి వరకు టెక్కలి గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు.
ఇంటర్‌ను మెళియాపుట్టి మండలం పెద్దమడి రెసిడెన్షియల్ కళాశాలలో 2006లో పూర్తి చేశారు. తూముకొండ గ్రామానికి చెందిన తన చిన్నాన్న, పిన్ని రవికుమార్, వజ్రంల సహకారంతో 2009లో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అనంతరం 2009–11లో విశాఖపట్నంలో ఎంబీఏ పూర్తి చేసి అనంతరం బీఎల్‌ను ఆంధ్రా యూనివర్సిటీలో 2015లో పూర్తి చేశారు. బీఎల్ పూర్తి చేశాక జడ్జి కావాలనే పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ పడిన సమ యంలో దరఖాస్తు చేశారు. అలా రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడకుండా 2020లో వెలువడిన నోటికేషన్‌లో ద రఖాస్తు చేసి రోజుకు సుమారు 20 గంటల పాటు కృషి చేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి 2022 మార్చి 29న విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సర్పంచ్ షణ్ముఖరావు, గ్రామస్తులు అభినందించారు.
చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్ చేయడంతో...
Comments
Please login to add a commentAdd a comment