న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్‌మండ్ కంట్రీ జిల్లా అటార్నీగా ఆమె పనిచేశారు. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మహిళకు ఇంతటి గౌరవం దక్కడం గర్వంగా ఉందని రాజరాజేశ్వరి తెలిపారు.