Rajarajeswari
-
10 వేల ఓటరు కార్డులు; ఈసీ అప్రమత్తం
బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నకిలీ ఓటరు కార్డులు కలకలం సృష్టించడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కర్ణాటక ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా డిప్యూటీ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్ను నియమిస్తూ.. ఆయన్ని బెంగళూరుకు అత్యవసరంగా పంపించింది. మంగళవారం జరిగిన ఘటనపై విచారించి నివేదికను అందజేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి చేరుకున్న చంద్రభూషణ్ అదే పనిలో నిమగ్నులయ్యారు. బెంగళూరుకు చేరుకున్న చంద్రభూషణ్ అధికారులతో కలిసి ఘటనపై ఆరా తీశారు. త్వరగా విచారణ చేపట్టి నేడో రేపో నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో మంగళవారం అర్థరాత్రి దాదాపు 10 వేల నకిలీ ఓటరు గుర్తుంపు కార్డులు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘వాటి వెనకాల ఉన్నది మీ పార్టీవారే’నంటే.. కాదు మీ పార్టీ హస్తమే’ అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాగా అవి బోగస్ కార్డులు కావని, అసలైన కార్డుల్లాగే ఉన్నాయని ఈసీ తేల్చింది. అయితే అన్ని వేల కార్డులు ఒక్కచోట ఉండటమేంటన్న అంశంపై మాత్రం దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. -
దేవీపురాన్ని సందర్శించిన షణ్ముఖ శర్మ
పెందుర్తి: రాజరాజేశ్వరీ మాత కొలువైన ప్రఖ్యాత దేవీపురం శ్రీమేరు క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మర్షి సామవేదం షణ్ముఖశర్మ శుక్రవారం సందర్శించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ఆచరించారు. దేవాలయంలో అపూర్వ కట్టడాలను పరిశీలించారు. ఆలయ చరిత్రను దేవీపురం ట్రస్ట్ కార్యదర్శి కందర్ప రమ షణ్ముఖశర్మకు వివరించారు. ముందుగా ట్రస్బ్ సభ్యుడు కందర్ప ప్రభాకర్, ఫౌండర్ అన్నపూర్ణమ్మ తదితరులు షణ్ముఖశర్మకు స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రాజరాజేశ్వరిగా వనదుర్గ
అమ్మవారికి ప్రత్యంగిర హోమం ముగిసిన శ్రావణమాస పూజలు అన్నవరం : రత్నగిరి వనాన్ని రక్షించే వనదుర్గ అమ్మవారికి గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రావణమాస పూజలు గురువారం ప్రత్యంగిర హోమం, పూర్ణాహుతితో ముగిశాయి. వనదుర్గమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, ఏడు గంటలకు ప్రత్యేక పూజలు, అనంతరం నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణ, సూర్యనమస్కారాలు, లింగార్చన, బాల, కుమారీ, సువాసినీ తదితర పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి కావడంతో అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఈఓ నాగేశ్వరరావు దంపతులు హోమద్రవ్యాలను సమర్పించారు. వేదపండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించి, వేదాశీస్సులందచేశారు. అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారికి కుంభం పోసి గుమ్మడికాయతో దిష్టి తీశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వెంకట్రావు, తదితరులు పూజాదికాలు నిర్వహించారు. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్మండ్ కంట్రీ జిల్లా అటార్నీగా ఆమె పనిచేశారు. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మహిళకు ఇంతటి గౌరవం దక్కడం గర్వంగా ఉందని రాజరాజేశ్వరి తెలిపారు. -
న్యూయార్క్ జడ్జిగా మన మహిళ ప్రమాణం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర క్రిమినల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన మహిళ రాజరాజేశ్వరి(43) ప్రమాణం చేశారు. ఆమెతోపాటు మొత్తం 27 మంది జడ్జీలతో మేయర్ బిల్ డి బ్లాసియో ప్రమాణ స్వీకారం చేయించారు. యుక్త వయసులో అమెరికాకు వెళ్లిన చెన్నైకు చెందిన రాజరాజేశ్వరి రిచ్మండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసి ఇటీవల న్యూయార్క్ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 27 మంది జడ్జీలు క్రిమినల్, ఫ్యామిలీ కోర్టులలో పదేళ్లపాటు పనిచేయనున్నారు. ఈ సందర్భంగా మేయర్ డి బ్లాసియో మాట్లాడుతూ అందరికీ సమానంగా న్యాయం చేసే వ్యవస్థ ఉన్నతమకు సరైన న్యాయం అందించే అర్హత ఉన్నవారే న్యాయమూర్తులుగా కావాలని నిర్ణయించి వీరిని నియమించామని చెప్పారు. -
‘న్యూయార్క్’ జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగర క్రిమినల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన మహిళ నియమితులయ్యారు. చెన్నైలో పుట్టిన రాజరాజేశ్వరి (43) ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆమె రిచ్మండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేస్తున్నారు. క్రిమినల్ కోర్టు జడ్జిగా ఆమెను మేయర్ బిల్ డి బ్లాసినో నియమించారు. మంగళవారం ఆమె లాంఛనంగా విధులు చేపట్టనున్నారు. అంతా కలగా ఉందని, తాను ఊహించిన దాని కంటే పెద్దదైన పదవి తనకు లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నూయార్క్లో భారత్కు చెందిన ఇద్దరు పురుషులు జడ్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక మహిళ అలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.