‘న్యూయార్క్’ జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగర క్రిమినల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన మహిళ నియమితులయ్యారు. చెన్నైలో పుట్టిన రాజరాజేశ్వరి (43) ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆమె రిచ్‌మండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేస్తున్నారు. క్రిమినల్ కోర్టు జడ్జిగా ఆమెను మేయర్ బిల్ డి బ్లాసినో నియమించారు.
మంగళవారం ఆమె లాంఛనంగా విధులు చేపట్టనున్నారు. అంతా కలగా ఉందని, తాను ఊహించిన దాని కంటే పెద్దదైన పదవి తనకు లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నూయార్క్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు పురుషులు జడ్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక మహిళ అలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.