500 సార్లు వీర్యదానం, అమ్మాయి దొరకట్లే! | Father Donated Sperm 500 Times His Son Getting Scared To Use Dating Sites | Sakshi
Sakshi News home page

కొంపముంచిన తండ్రి వీర్యదానం..

Published Mon, Feb 22 2021 1:32 PM | Last Updated on Mon, Feb 22 2021 3:22 PM

Father Donated Sperm 500 Times His Son Getting Scared To Use Dating Sites - Sakshi

న్యూయార్క్‌: యుక్తవయసులో అబ్బాయిలు సాధారణంగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడటం సహజం. కానీ మీరు మనసారా కోరుకున్న అమ్మాయి మీ రక్తసంబంధమని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా? ఇదిగో అచ్చంగా ఇలాంటి విచిత్ర ఘటన అమెరికాలో జరిగింది. 24 ఏళ్ళ జెప్‌కు జెప్‌కు ప్రేమించి పెళ్ళి చేసుకొవడమంటే ఇష్టం.. కానీ తన తండ్రి చేసిన పని ఇప్పుడతని ప్రేమ వివాహానికి అడ్డంకిగా మారింది. అదేంటంటే, గడచిన పదేళ్ళలో జెప్‌ తండ్రి 500 సార్లు వీర్యదానం చేశాడు. గ్రహీతల్లో చుట్టుపక్కల వారే అధికంగా ఉన్నారు.

దీంతో ఏ అమ్మాయిని చూసినా పెళ్లి మాటెత్తడానికి జంకుతున్నాడు. ఎందుకంటే జన్యుపరంగా తల్లులు వేరైనప్పటికి వాళ్లు తన తండ్రి వీర్యంతోనే పుట్టారేమోనని తెగ భయపడిపోతున్నాడు. ఈ క్రమంలో ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలన్నా ఎక్కడ తనకు బంధువులవుతారో అని ఇబ్బంది పడుతున్నాడు. కొన్నిరోజుల క్రితం మెక్‌లెనన్‌ కోలన్‌ తన సోదరుడవుతాడని తెలుసుకున్న జెప్‌, అతడు తన పాఠశాలలోనే చదివాడని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఇప్పటి వరకు తన చుట్టుపక్కల 8 మంది చెల్లెళ్ళను గుర్తించినట్లు జెవ్‌ మీడియాకు తెలిపాడు. తమ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తండ్రి వీర్యంతో జన్మించిన వాళ్లు చాలా మందే ఉన్నారని ఆవేదన చెందాడు. ఇప్పటి వరకు తండ్రి వీర్యం దానంతో  50 మంది పిల్లలు పుట్టారని జెప్‌ తెలిపాడు.

చదవండిఅమ్మాయిలతో మసాజ్‌.. 55 లక్షలు దోచుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement