Sperm Donor
-
16 ఏళ్లుగా వీర్యదానం?.. ఎట్టకేలకు కళ్లెం!
ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్స్ కోర్టు ఒకటి శుక్రవారం ఆసక్తికర తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తిని ఇకపై వీర్యదానం చేయొద్దని పేర్కొంటూ అతనిపై నిషేధం విధించింది. అంతగా ఎందుకు సీరియస్ అయ్యిందంటే.. గత 16 ఏళ్లుగా అతను వీర్యదానం చేస్తూ వస్తున్నాడట!. ఆ దానం వల్ల వందల మంది పిల్లలు పుట్టారట!. అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈ తీర్పు ఇస్తూ.. ఇంకోసారి దానం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జోనాథన్ జాకోబ్ మెయిజర్(41) అనే వ్యక్తికి వ్యతిరేకంగా ది హేగ్ నగరంలోని న్యాయస్థానంలో.. ఓ మహిళ, ఓ ఫౌండేషన్లు దావా వేశాయి. తన వీర్యం ద్వారా తాను ఎంతమందికి జన్మనిచ్చాననే విషయాన్ని దాచి.. తన దగ్గరికి వచ్చే పేరెంట్స్‌ను జోనాథన్ మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. విచారణ అనంతరం అది నిజమని కోర్టు తేల్చింది. ఇకపై జోనాథన్ వీర్యదానం చేయకూడదని ఆదేశిస్తూ.. ఒకవేళ కాదని ఆ పని చేస్తే లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. ఇప్పటిదాకా జన్మినిచ్చిన పిల్లల పేరెంట్స్‌తో జోనాథన్ సంప్రదింపులు కూడా జరపొద్దని స్పష్టం చేసింది. మ్యూజిషియన్ అయిన జోనాథన్ జాకోబ్ మెయిజర్.. ప్రస్తుతం కెన్యాలో ఉంటున్నాడు. ఇప్పటిదాకా 13 క్లినిక్స్‌లో తన వీర్యాన్ని దానం చేశాడని తెలుస్తోంది. అందులో 11 క్లినిక్స్ నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయి. డచ్ క్లినికల్ గైడ్‌లైన్స్ ప్రకారం.. వీర్యదాతలు 12 మంది మహిళలకంటే ఎక్కువమందికి వీర్యదానం చేయకూడదు. 25 మంది పిల్లలకు మించి జన్మనివ్వకూడదు. అయితే.. మెయిజర్ మ్రాం నిబంధనలకు విరుద్ధంగా వీర్యదానం చేసుకుంటూ పోతున్నాడు. 2007 నుంచి.. అతని వీర్యదానం ఫలితంగా ఏకంగా 550 నుంచి 600 మంది పిల్లలు పుట్టారట. విచ్చలవిడిగా వీర్యదానం చేసుకుంటూ పోతున్న అతనిపై 2017లో నిషేధం విధించాయి అక్కడి ఫెర్టిలిటీ క్లినిక్స్. అయితే.. అప్పటి నుంచి విదేశాల్లో ఉన్నవాళ్లకి ఆన్లైన్ సంప్రదింపుల ద్వారా వీర్యదానం చేస్తూ వస్తున్నాడు. అయితే.. పిల్లల్ని కనలేని తల్లిదండ్రులకు మెయిజర్ సాయం చేస్తున్నాడని, నిషేధం సరికాదని అతని లాయర్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సూడాన్‌లో చిమ్మచీకట్లో.. మన సైన్యం సాహసం -
500 సార్లు వీర్యదానం, అమ్మాయి దొరకట్లే!
న్యూయార్క్: యుక్తవయసులో అబ్బాయిలు సాధారణంగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడటం సహజం. కానీ మీరు మనసారా కోరుకున్న అమ్మాయి మీ రక్తసంబంధమని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా? ఇదిగో అచ్చంగా ఇలాంటి విచిత్ర ఘటన అమెరికాలో జరిగింది. 24 ఏళ్ళ జెప్కు జెప్కు ప్రేమించి పెళ్ళి చేసుకొవడమంటే ఇష్టం.. కానీ తన తండ్రి చేసిన పని ఇప్పుడతని ప్రేమ వివాహానికి అడ్డంకిగా మారింది. అదేంటంటే, గడచిన పదేళ్ళలో జెప్ తండ్రి 500 సార్లు వీర్యదానం చేశాడు. గ్రహీతల్లో చుట్టుపక్కల వారే అధికంగా ఉన్నారు. దీంతో ఏ అమ్మాయిని చూసినా పెళ్లి మాటెత్తడానికి జంకుతున్నాడు. ఎందుకంటే జన్యుపరంగా తల్లులు వేరైనప్పటికి వాళ్లు తన తండ్రి వీర్యంతోనే పుట్టారేమోనని తెగ భయపడిపోతున్నాడు. ఈ క్రమంలో ఎవరితోనైనా డేటింగ్ చేయాలన్నా ఎక్కడ తనకు బంధువులవుతారో అని ఇబ్బంది పడుతున్నాడు. కొన్నిరోజుల క్రితం మెక్లెనన్ కోలన్ తన సోదరుడవుతాడని తెలుసుకున్న జెప్, అతడు తన పాఠశాలలోనే చదివాడని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఇప్పటి వరకు తన చుట్టుపక్కల 8 మంది చెల్లెళ్ళను గుర్తించినట్లు జెవ్ మీడియాకు తెలిపాడు. తమ వీధిలోని ఓ అపార్ట్మెంట్లో తండ్రి వీర్యంతో జన్మించిన వాళ్లు చాలా మందే ఉన్నారని ఆవేదన చెందాడు. ఇప్పటి వరకు తండ్రి వీర్యం దానంతో 50 మంది పిల్లలు పుట్టారని జెప్ తెలిపాడు. చదవండి: అమ్మాయిలతో మసాజ్.. 55 లక్షలు దోచుకున్నారు -
ఆయనకు 800 మంది పిల్లలు
లండన్: ప్రపంచంలోనే ఇలాంటి వీర్యదాత (స్పెర్మ్ డోనర్) మరొకరు ఉండరేమో! గత 16 ఏళ్లుగా వీర్యాన్ని దానం చేయడం ద్వారా ఇప్పటికే 800 మంది పిల్లలకుపైగా తండ్రయ్యారు. కనీసం వెయ్యి మంది పిల్లలకు తండ్రిని కావాలన్నది ఆయన లక్ష్యం. లక్ష్య సాధనలో ముందుకు సాగాలన్నా తాపత్రయంతో గత మూడేళ్లుగా ప్రణయ గీతాలు పాడుతున్న గర్ల్ ఫ్రెండ్‌ను కూడా ఇటీవలనే వదులుకున్నారు. ఆయనే 41 ఏళ్ల సైమన్ వాట్సన్. బెడ్ఫోర్డ్షైర్లోని లూటన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు మొదటి పెళ్లి ద్వారా 17, 19 ఏళ్ల ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో పెళ్లి ద్వారా పదేళ్ల కూతురు కూడా ఉంది. వీర్య విక్రయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల మూడేళ్ల గర్ల్ ఫ్రెండ్‌కు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఏదేమైనా తన లక్ష్యాన్ని లేదా వ్యాపారాన్ని వదులుకోనన్నారు. అందుకని గర్ల్ ఫ్రెండ్‌నే వదిలేధారు. తన వీర్యం పిల్లలు పుట్టించే ‘మహత్తు గల పానం’ అని చెప్పుకుంటాడు. ఇంత వ్యాపారం చేస్తున్నా వాట్సన్ స్మెర్మ్ బ్యాంకులను ఆశ్రయించరు. సోషల్ వెబ్సైట్, ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా ప్రచారం చే సుకొని వీర్య స్వీకతులను వెతికి పట్టుకుంటారు. ఒక్క వీర్యం పాట్‌ను ఐదువేల రూపాయలకు అమ్ముతుంటారు. వీర్య దానం పట్ల ఇంత ప్యాషన్ ఉంటే ఉచితంగానే దానం చేయవచ్చుకదా! అని ప్రశ్నించిన ఆడవాళ్లు లేకపోలేదు. వారందరికి ఆయనిచ్చే సమాధానం ఒక్కటే. ఇప్పటికే చాలా చీప్‌గా అమ్ముతున్నానని అంటారు. తన వీర్యం ద్వారా పురుడు పోసుకున్న పిల్లలను తనకు వీలు చిక్కినప్పుడల్లా చూసొస్తుండాట. తన పుణ్యమా అని పుట్టిన వారిలో కవలలు కూడా ఉన్నారట.