లండన్: ప్రపంచంలోనే ఇలాంటి వీర్యదాత (స్పెర్మ్ డోనర్) మరొకరు ఉండరేమో! గత 16 ఏళ్లుగా వీర్యాన్ని దానం చేయడం ద్వారా ఇప్పటికే 800 మంది పిల్లలకుపైగా తండ్రయ్యారు. కనీసం వెయ్యి మంది పిల్లలకు తండ్రిని కావాలన్నది ఆయన లక్ష్యం. లక్ష్య సాధనలో ముందుకు సాగాలన్నా తాపత్రయంతో గత మూడేళ్లుగా ప్రణయ గీతాలు పాడుతున్న గర్ల్ ఫ్రెండ్‌ను కూడా ఇటీవలనే వదులుకున్నారు.
ఆయనే 41 ఏళ్ల సైమన్ వాట్సన్. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని లూటన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు మొదటి పెళ్లి ద్వారా 17, 19 ఏళ్ల ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో పెళ్లి ద్వారా పదేళ్ల కూతురు కూడా ఉంది. వీర్య విక్రయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల మూడేళ్ల గర్ల్ ఫ్రెండ్‌కు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఏదేమైనా తన లక్ష్యాన్ని లేదా వ్యాపారాన్ని వదులుకోనన్నారు. అందుకని గర్ల్ ఫ్రెండ్‌నే వదిలేధారు. తన వీర్యం పిల్లలు పుట్టించే ‘మహత్తు గల పానం’ అని చెప్పుకుంటాడు.
ఇంత వ్యాపారం చేస్తున్నా వాట్సన్ స్మెర్మ్ బ్యాంకులను ఆశ్రయించరు. సోషల్ వెబ్‌సైట్, ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చే సుకొని వీర్య స్వీకతులను వెతికి పట్టుకుంటారు. ఒక్క వీర్యం పాట్‌ను ఐదువేల రూపాయలకు అమ్ముతుంటారు. వీర్య దానం పట్ల ఇంత ప్యాషన్ ఉంటే ఉచితంగానే దానం చేయవచ్చుకదా! అని ప్రశ్నించిన ఆడవాళ్లు లేకపోలేదు. వారందరికి ఆయనిచ్చే సమాధానం ఒక్కటే. ఇప్పటికే చాలా చీప్‌గా అమ్ముతున్నానని అంటారు. తన వీర్యం ద్వారా పురుడు పోసుకున్న పిల్లలను తనకు వీలు చిక్కినప్పుడల్లా చూసొస్తుండాట. తన పుణ్యమా అని పుట్టిన వారిలో కవలలు కూడా ఉన్నారట.
ఆయనకు 800 మంది పిల్లలు
Published Thu, Jan 14 2016 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement