ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదర్లాండ్స్ కోర్టు ఒకటి శుక్రవారం ఆసక్తికర తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తిని ఇకపై వీర్యదానం చేయొద్దని పేర్కొంటూ అతనిపై నిషేధం విధించింది. అంతగా ఎందుకు సీరియస్ అయ్యిందంటే.. గత 16 ఏళ్లుగా అతను వీర్యదానం చేస్తూ వస్తున్నాడట!. ఆ దానం వల్ల వందల మంది పిల్లలు పుట్టారట!. అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈ తీర్పు ఇస్తూ.. ఇంకోసారి దానం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
జోనాథన్ జాకోబ్ మెయిజర్(41) అనే వ్యక్తికి వ్యతిరేకంగా ది హేగ్ నగరంలోని న్యాయస్థానంలో.. ఓ మహిళ, ఓ ఫౌండేషన్‌లు దావా వేశాయి. తన వీర్యం ద్వారా తాను ఎంతమందికి జన్మనిచ్చాననే విషయాన్ని దాచి.. తన దగ్గరికి వచ్చే పేరెంట్స్‌ను జోనాథన్ మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. విచారణ అనంతరం అది నిజమని కోర్టు తేల్చింది.
ఇకపై జోనాథన్ వీర్యదానం చేయకూడదని ఆదేశిస్తూ.. ఒకవేళ కాదని ఆ పని చేస్తే లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. ఇప్పటిదాకా జన్మినిచ్చిన పిల్లల పేరెంట్స్‌తో జోనాథన్ సంప్రదింపులు కూడా జరపొద్దని స్పష్టం చేసింది.
మ్యూజిషియన్ అయిన జోనాథన్ జాకోబ్ మెయిజర్.. ప్రస్తుతం కెన్యాలో ఉంటున్నాడు. ఇప్పటిదాకా 13 క్లినిక్స్‌లో తన వీర్యాన్ని దానం చేశాడని తెలుస్తోంది. అందులో 11 క్లినిక్స్ నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయి. డచ్ క్లినికల్ గైడ్‌లైన్స్ ప్రకారం.. వీర్యదాతలు 12 మంది మహిళలకంటే ఎక్కువమందికి వీర్యదానం చేయకూడదు. 25 మంది పిల్లలకు మించి జన్మనివ్వకూడదు.
అయితే.. మెయిజర్ మ్రాం నిబంధనలకు విరుద్ధంగా వీర్యదానం చేసుకుంటూ పోతున్నాడు. 2007 నుంచి.. అతని వీర్యదానం ఫలితంగా ఏకంగా 550 నుంచి 600 మంది పిల్లలు పుట్టారట. విచ్చలవిడిగా వీర్యదానం చేసుకుంటూ పోతున్న అతనిపై 2017లో నిషేధం విధించాయి అక్కడి ఫెర్టిలిటీ క్లినిక్స్. అయితే.. అప్పటి నుంచి విదేశాల్లో ఉన్నవాళ్లకి ఆన్‌లైన్ సంప్రదింపుల ద్వారా వీర్యదానం చేస్తూ వస్తున్నాడు. అయితే.. పిల్లల్ని కనలేని తల్లిదండ్రులకు మెయిజర్ సాయం చేస్తున్నాడని, నిషేధం సరికాదని అతని లాయర్ చెబుతున్నాడు.
ఇదీ చదవండి: సూడాన్‌లో చిమ్మచీకట్లో.. మన సైన్యం సాహసం
Comments
Please login to add a commentAdd a comment