
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ శవాల గుట్టగా మారింది. స్థానిక ఆండ్రూ క్లెక్లీ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో నిండి ఉన్న ట్రక్కును నిలిపి ఉంచటం స్థానికుల కంటపడింది. ట్రక్కు నుంచి దుర్వాసన రావటంతో వారు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటీన నాలుగు ఏసీ ట్రక్కులను ఏర్పాటు చేసి సుమారు 50 మృతదేహాలను ఆ ట్రక్కుల్లోకి మార్చారు. అయితే ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించడం లేదు. కాగా కరోనా మహమ్మారి బారినపడి న్యూయార్క్‌లో 17,866 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికాలో 10,76,129 మందికి కరోనా సోకగా, 62,380 వేల మంది మరణించారు. (రష్యా ప్రధానికి కరోనా)
Comments
Please login to add a commentAdd a comment