న్యూయార్క్ జడ్జిగా మన మహిళ ప్రమాణం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర క్రిమినల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన మహిళ రాజరాజేశ్వరి(43) ప్రమాణం చేశారు. ఆమెతోపాటు మొత్తం 27 మంది జడ్జీలతో మేయర్ బిల్ డి బ్లాసియో ప్రమాణ స్వీకారం చేయించారు. యుక్త వయసులో అమెరికాకు వెళ్లిన చెన్నైకు చెందిన రాజరాజేశ్వరి రిచ్‌మండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసి ఇటీవల న్యూయార్క్ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 27 మంది జడ్జీలు క్రిమినల్, ఫ్యామిలీ కోర్టులలో పదేళ్లపాటు పనిచేయనున్నారు. ఈ సందర్భంగా మేయర్ డి బ్లాసియో మాట్లాడుతూ అందరికీ సమానంగా న్యాయం చేసే వ్యవస్థ ఉన్నతమకు సరైన న్యాయం అందించే అర్హత ఉన్నవారే న్యాయమూర్తులుగా కావాలని నిర్ణయించి వీరిని నియమించామని చెప్పారు.