విలువ రూ.45.60 లక్షలు ఇద్దరు నిందితుల అరెస్టు
మరో ఐదుగురి కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు
అనకాపల్లి: లారీలో తరలిస్తున్న 912 కేజీల గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి ఎస్పీ ఎం.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం–కొత్తవలస రహదారిపై గుల్లేపల్లి జంక్షన్ వద్ద సబ్బవరం పోలీసులు ఆదివారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. ఓ లారీని తనిఖీ చేయగా.. క్యాబిన్‌లోని రహస్య అరల్లో 456 ప్యాకెట్లు కనిపించాయి. లారీకి ప్రత్యేక అరలు తయారు చేయించి డ్రైవర్ కూర్చునే క్యాబిన్‌లోను, సీటు భాగంలోను గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.45.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
లారీని సీజ్‌చేసి తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపూర్‌కు చెందిన లారీ డ్రైవర్ బారావత్ తరుణ్ (22), ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పనసపట్టు గ్రామానికి చెందిన సేతి మలే‹Ùరావు(24)ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వీరయ్యరెడ్డి, అజీ్మరానగే‹Ù, బోతు వెంకట్రావు, కొండారెడ్డి, రాకేష్‌లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు రూ.15 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. సబ్బవరం సీఐ పిన్నింటి రమణకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ ధనుంజయ్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారని ఎస్పీ దీపిక తెలిపారు.
450 కిలోల గంజాయి స్వాధీనం
వ్యాన్‌ను వెంబడించి పట్టుకున్న పోలీసులు
వాహనాన్ని వదిలి పరారైన నిందితులు
విజయనగరం జిల్లాలో ఘటన
కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద 450 కిలోల గంజాయిని, వ్యాన్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కొత్తవలస సీఐ సీహెచ్ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. ఎస్.కోట మండలం సమీపంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం తెల్లవారు జామున వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అరకు నుంచి వేగంగా ఓ వ్యాన్ వచ్చింది. చెక్‌పోస్టు వద్ద ఆపేందుకు పోలీసులు ప్రయత్నంచినా విశాఖపట్నం వైపు వేగంగా దూసుకుపోయింది. దీంతో పోలీసులు విషయాన్ని ఎల్.కోట పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేశారు.
ఎల్.కోట ఏఎస్‌ఐ సత్యం, జీపు డ్రైవర్ ప్రసాద్ వెంటనే వ్యాన్‌ను గుర్తించి ఎల్.కోట కూడలి వద్ద ఆపేందుకు ప్రయతి్నంచినా ఆపకపోవడంతో వెంబడించారు. కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపైన వ్యాన్‌ను నిలిపి నిందితులు పరారయ్యారు. కొత్తవలస పోలీస్ స్టేషన్‌కు తరలించి వ్యాన్‌ను పరిశీలించగా కూరగాయాలు తరలించే కేట్లు మధ్య పెద్ద పెద్ద సంచుల్లో 5 కేజీలు, రెండు కేజీలు చొప్పున ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటిని తూకం వేయగా 450 కిలోలు వచి్చనట్టు సీఐ తెలిపారు. ఈ వాహనం మధ్యప్రదేశ్ రాష్ట్ర రిజి్రస్టేషన్ కలిగి ఉందని, సీబుక్ ఆధారంగా చిరునామా కోసం విచారిస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment