జొమాటో డెలివరీ బాయ్‌ ముసుగులో గంజాయి సప్లయ్‌ | Food Delivery Boy held, Supply Ganja in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: జొమాటో డెలివరీ బాయ్‌ ముసుగులో గంజాయి సప్లయ్‌

Published Wed, Dec 14 2022 7:52 PM | Last Updated on Wed, Dec 14 2022 8:20 PM

Food Delivery Boy held, Supply Ganja in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జొమాటో డెలివరీ బాయ్‌ ముసుగులో గంజాయి సప్లయ్‌ చేస్తున్న చుంచు నితీష్‌ చంద్రని తుకారంగేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడ్లర్‌ రాహుల్‌ ఆదేశాలతో అవసరమైనవారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్‌ ఐటమ్‌లో కోడ్‌ భాషను ఉపయోగిస్తూ గంజాయి సరఫరా జరుగుతోంది.

జొమాటోలో ఉద్యోగం చేస్తూ డబ్బు కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడు. నితీష్‌ చంద్ర వద్ద 600 గ్రాముల గంజాయి, రూ.5వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 30 మంది కస్టమర్లకు గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించారు. నితీష్‌ చంద్ర అరెస్ట్‌తో భువనగిరి పీఎస్‌లో పెడ్లర్‌ రాహుల్‌ లొంగిపోయారు. 

చదవండి: (కాంగ్రెస్‌ను నాశనం చేస్తోంది వారేనా?.. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement