
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ బస్సులో నోట్ల కట్టలు బయటపడటంతో కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వస్తున్న ప్రైవేట్ బస్సులో 30లక్షల అనధికార నగదు దొరికింది. ఆ డబ్బును తరిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే బస్సులో గంజాయి తరలిస్తున్న మరో ఇద్దరు కేటుగాళ్లు పట్టుబడ్డారు. దాదాపు 50కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్తే, అనధికార సొమ్మును కూడా గుర్తించామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment