విశాఖపట్టణం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల కోసం ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంత సర్వీస్‌లను నిలిపివేసింది.
(పాడేరు)