ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పిలుపుమేరకు నిరసన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశా యి.
పాడేరు/గూడెంకొత్తవీధి/సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పిలుపుమేరకు నిరసన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశా యి. బుధవారం ఏవోబీ బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యమంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో మా వోయిస్టులు కరపత్రాలతో ఇప్పటికే బంద్ విజయవంతానికి ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర సం ఘటనలు చోటుచేసుకుంటాయోనని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. ఆర్టీసీ అధికారులు మారుమూల ప్రాం తాలకు బస్‌లను నిలిపివేశారు.
బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొంతకాలంగా ఏజెన్సీలో పట్టుకోల్పోయిన మావోయిస్టులు ఎలాగైనా పూర్వస్థితి కోసం ప్రయత్నిస్తున్నారు. తమ ఉద్యమానికి ఆటంకంగా ఉన్నవారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జీకే వీధి, చింతపల్లి మండలాలకు చెందిన ముగ్గురు గిరిజనులను పోలీస్ ఇన్‌ఫార్మర్ల పేరిట హతమార్చారు. ఏవోబీ బంద్ విజయవంతం చేయాలంటూ జీకేవీధి మండలంలోని తూరుమామిడి, పెదవలస ప్రాంతాల్లో కరత్రాలు అంటించి ప్రచారం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే మన్యంలో బలగాలు మొహరించాయి. మైదాన ప్రాంతాలకు వెళ్లాలని అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులు ఇప్పటికే ఆదేశించారు. కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మండల కేంద్రాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. మారుమూల ప్రాంతాల్లో గాలింపు చర్యలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని గూడేల్లోని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.