విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలోని అరకు వెళ్లే దారిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ కారు చెట్టును బలంగా ఢీకొట్టింది.
100 కేజీల గంజాయి స్వాధీనం
Published Fri, Dec 11 2015 11:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM
పాడేరు: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలోని అరకు వెళ్లే దారిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గుర్తించిన స్ధానికలు క్షతగాత్రుడిని పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారులో 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు.
Advertisement
Advertisement